అమెరికాలో 'నా పేరు సూర్య' ఆటా పాట..
- March 23, 2018
అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న నా పేరు సూర్య (నా ఇల్లు ఇండియా) చిత్రం కోసం ఓ రొమాంటిక్ పాటను అమెరికాలో చిత్రీకరిస్తున్నారు. అల్లు అర్జున్‌తో పాటు కథానాయిక అను ఇమ్మాన్యుయేల్ పై ఈ పాటను తీస్తున్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీష శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం అమెరికాలో చిత్రీకరిస్తున్న పాట పూర్తికాగానే చిత్రబృందం తిరిగి హైదరాబాద్ చేరుకుని ఓ ప్రత్యేక పాటను తీయనుంది. ఈ పాటను అల్లు అర్జున్, బాలీవుడ్ భామ ఎలీ అవరమ్పై చిత్రీకరించనున్నట్లు సమాచారం. సందేశంతో కూడుకున్న చక్కటి సాహిత్యంతో ఈ పాట ఉంటుందని అంటున్నారు. అల్లు అర్జున్ ఆర్మీ సోల్జర్ (సైనికుడు)గా తన అద్వితీయమైన నటనను ఈ చిత్రంలో ప్రదర్శించారని, ఆయనపై తీసిన ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రానికి ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత లగడపాటి శ్రీధర్ వెల్లడించారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం ఆడియో వేడుకను నిర్వహించి, మే 4న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్, శేఖర్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలోని ఇతర ముఖ్యపాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్, శరత్‌కుమార్ తదితరులు నటిస్తుండగా, సినిమాటోగ్రఫీని రాజీవ్ రవి, ఎడిటింగ్‌ను కోటగిరి వెంకటేశ్వరరావును అందిస్తున్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాత: బన్ని వాసు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







