నందు ''ఇంతలో ఎన్నెన్ని వింతలో'' ఏప్రిల్ 6న విడుదల..
- March 24, 2018
హరహర చలన చిత్ర సమర్పణలో ఎస్ శ్రీకాంత్ రెడ్డి, రామమోహన రావు ఇప్పిలి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న చిత్రం 'ఇంతలో ఎన్నెన్ని వింతలో'. ఈ చిత్రానికి హీరో హీరోయిన్స్ నందు, సౌమ్య వేంగోపాల్, పూజ రామచంద్రన్ కాగా దర్శకుడు వరప్రసాద్ వరికూటి. ఈ చిత్రం అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఏప్రిల్ 6న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యం లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ సందర్బంగా నిర్మాత రామమోహన రావు మాట్లాడుతూ ఇటీవలే ఈ చిత్ర పాటలు ఎఫ్ ఎమ్ ద్వారా విడుదలయ్యాయి.. 3పాటలను అందరూ అభినందిస్తున్నారు.. నలుగురి మధ్య ఉత్కంఠభరితంగా సాగే కథ... సినిమా చాలా బాగొచ్చింది.. ఆడియోన్స్ కు ఫ్రెష్ గా ఫీల్ కలుగుతుంది అన్నారు. అనంతరం దర్శకుడు వరప్రసాద్ వరికూటి మాట్లాడుతూ ఇది నా మొదటి చిత్రం. సినిమా మొదలు పెట్టినప్పుడు ఎలాంటి కాంఫిడెన్స్ తో అయితే ఉన్నామో అదే కాంఫిడెన్స్ తో ఇప్పటికీ వున్నాము. కథ, స్క్రీన్ ప్లే ఈ చిత్రం లో హైలెట్స్ గా నిలబడతాయి. ఆరోగ్యకరమైన గార్డెన్ నుంచి ఒక ఫ్రూట్ బయటకు వస్తే ఎలా ఫీల్ అవుతారో ఆ ఫ్రెష్ ఫీల్ ను సినిమా చూస్తున్నప్రేక్షకులు అనుభవిస్తారు ... నాకు మంచి ప్రొడక్షన్ దొరికింది.. వెల్ టెక్నీషియన్స్ తో పాటు పవర్ ఫుల్ ఆర్టిస్ట్స్ ను నాకు అందించారు నిర్మాతలు.. ప్రేక్షకునికి కావాల్సినవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని అందుకేతప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుందని భావిస్తున్నా అన్నారు.
నందు, సౌమ్య వేణుగోపాల్, పూజారామచంద్రన్, గగన్ విహారి, ఆర్ కె, మీనా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్ మోహన్ రెడ్డి, ఎడిటర్: చోటా కె ప్రసాద్, సంగీతం: యాజమాన్య, మాటలు: కె వి రాజమహి, మధు శ్రీనివాస్ గోపాలుని, కొరియోగ్రఫీ: విఘ్నేశ్వర, లిరిక్స్: సురేష్ ఉపాద్యాయ, ఆర్ట్ : జిల్లా మోహన్, స్టంట్స్: మార్షల్ రమణ, పి ఆర్వో: కడలి రాంబాబు, సహ నిర్మాత: డి. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం : వర ప్రసాద్ వరకూటి
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..