వాట్సాప్‌లో వస్తున్న మరో సూపర్బ్ ఫీచర్..!
- March 25, 2018
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్లకు త్వరలో మరో అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఇకపై వాట్సాప్‌లో యూజర్లు తాము పంపుకున్న ఫొటోలు, టెక్ట్స్ సందేశాలు, వీడియోలు తదితర డేటా మొత్తాన్ని కలిపి ఒకేసారి డౌన్‌లోడ్ చేసుకునేలా అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ కేవలం ఫేస్‌బుక్‌లో మాత్రమే అందుబాటులో ఉండగా త్వరలో దీన్ని వాట్సాప్‌లోనూ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ కొత్త ఫీచర్ మే 25వ తేదీ లోపు యూజర్లకు లభిస్తుందని సమాచారం. వాట్సాప్‌లో రానున్న ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తాము పంపుకున్న ఫొటోలు, మెసేజ్‌లు, వీడియోలను ఒకేసారి జిప్ ఫైల్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు గాను ముందుగా యూజర్లు వాట్సాప్ ఓపెన్ చేసి అందులో సెట్టింగ్స్‌లో ఉండే అకౌంట్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో యూజర్లకు డౌన్‌లోడ్ మై డేటా అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే రిక్వెస్ట్ రిపోర్ట్ అనే బటన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే మీ వాట్సాప్ డేటా డౌన్‌లోడ్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ అవుతుంది. అనంతరం అక్కడే 20 రోజులలోగా మీ వాట్సాప్ డేటా ఫైల్ దర్శనమిస్తుంది.
అది జిప్ లేదా సీఎస్‌వీ రూపంలో ఉంటుంది. అలా డేటా ఫైల్ రెడీ అవగానే వాట్సాప్ మీకు నోటిఫికేషన్ పంపుతుంది. డేటా రెడీ అయింది, డౌన్‌లోడ్ చేసుకోండి అంటూ నోటిఫికేషన్ వస్తుంది. అనంతరం మీరు ఆ డేటాను డౌన్‌లోడ్ చేసుకోగానే ఆ ఫైల్ ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది.
అయితే డేటా మళ్లీ కావాలంటే పైన చెప్పిన మెథడ్‌ను మరోసారి ఫాలో అవ్వాలి. ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్‌ను అంతర్గతంగా పరిశీలిస్తున్నది. అతి త్వరలోనే యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







