త్రీడీలో మోదీ.. షేర్‌ చేసిన ప్రధాని

- March 25, 2018 , by Maagulf
త్రీడీలో మోదీ.. షేర్‌ చేసిన ప్రధాని

న్యూఢిల్లీ: గత సంవత్సరం ప్రపంచ యోగా డేను ఘనంగా నిర్వహించిన ప్రధాని మోదీ ఇప్పుడు యోగా టీచర్‌గా అవతారమెత్తారు. త్రీకోణాసనం నేర్పిస్తున్న యోగా టీచర్‌గా ఉన్న ఓ త్రీడీ యానిమేషన్‌ వీడియోను విడుదల చేశారు. ఆదివారం 42వ మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ ఓ త్రీడి వీడియోను షేర్‌ చేశారు. అందులో త్రీకోణాసనం నేర్పిస్తున్న యోగా టీచర్‌గా మోదీ కనిపిస్తారు. ప్రధాని మాట్లాడుతూ.. ‘నేను యోగా టీచర్ను కాదు. కొంత మంది తమ ప్రతిభతో నన్ను ఇలా మార్చేశారు’ అని అన్నారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2018 బడ్జెట్‌లో రైతులకు పెద్దపీఠ వేసినట్టు, పంటలకు 1.5 రెట్లు మద్దతు ధర ఇవ్వనున్నట్టు తెలిపారు. దేశంలోని ప్రతి ప్రాంతానికి ఆరోగ్య కేంద్రాలను విస్తరించడానికి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. దేశ యువత ఫిట్‌ మూమెంట్‌ తెచ్చి దాన్ని విజయవంతం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. బీఆర్‌ అంబేద్కర్‌ భారత్‌ను ఇండస్ట్రీయల్‌ పవర్‌హౌజ్‌ దేశంగా చేయాలని కలలు కన్నారని వాటిని నిజం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రధాని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com