భారత్ సిద్ధంగా ఉంది...చైనా కి హెచ్చరిక
- March 25, 2018
డెహ్రాడూన్ : డొక్లాంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొవడానికైనా భారత్ సిద్ధంగా ఉందని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. శత్రువులతో పోరాడటానికి చైనా సిద్ధంగా ఉందంటూ ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డొక్లాం సమస్యపై నిర్మలా ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
శనివారం భారత రాయబారి గౌతమ్ బంబావాలే మాట్లాడుతూ.. భారత సరిహద్దులో స్టేటస్ క్యూను చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డొక్లాం లాంటి ఘటన పునరావృతమవుతుందని అన్నారు. మునుపెన్నడూ చూడని ఘటనలను సైతం సరిహద్దులో భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు.
గత నెలలో రక్షణ శాఖ మంత్రి చైనా డొక్లాంలో హెలికాప్టర్లు, సెంట్రీ పోస్టులు, ట్రెంచెస్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తోందని పార్లమెంట్‌లో పేర్కొన్నారు. గతేడాది జూన్ 16 నుంచి ఆగష్టు 18ల వరకూ చైనా-భారత్‌ల మధ్య డొక్లాం సమస్య నెలకొన్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..