తెలుగు మాట్లాడితే జీతం కట్..!
- March 26, 2018
స్కూల్ ఆవరణలో తెలుగు మాట్లాడితే వేతనం కట్ చేస్తామంటూ కరీంనగర్ జిల్లాలో మెమో జారీ అయింది. గురుకుల స్కూళ్లు, ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు, విద్యార్థులతో మొత్తంగా ఇంగ్లీష్‌లోనే మాట్లాడాలంటూ నోటీసులు జారీ చేశారు. అది కూడా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడితే కుదరదు. ఫ్లూయెంట్‌గా ఉంటేనే వేతనం వస్తుంది. ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేని వారు సెలవుపై వెళ్లాలని, లేదంటే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లాలంటూ ఉపాధ్యాయాలను హెచ్చరించారు ఉన్నతాధికారులు. ఈ మేరకు లిఖిత పూర్వక ఆదేశాలు వెలువడడం కలకలం సృష్టిస్తోంది.
ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు పెంచడానికి, పిల్లలకు నాణ్యమైన విద్య అందించడానికే ఇలాంటి నోటీసు ఇవ్వాల్సి వచ్చిందంటూ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ నోటీసుతో ఇంగ్లీష్ అంతంత మాత్రం వచ్చిన టీచర్లు భయపడిపోతున్నారు. రీజినల్ కో ఆర్డినేటర్లు స్కూళ్లలో తనిఖీలకు వస్తున్నారంటేనే వణికిపోతున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







