స్వీట్ హార్ట్ 'మిస్టర్ సి' కి ఉపాసన స్పెషల్ విషెస్

- March 26, 2018 , by Maagulf
స్వీట్ హార్ట్ 'మిస్టర్ సి' కి ఉపాసన స్పెషల్ విషెస్

మార్చి 27న రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా భార్య ఉపాసన చెర్రీని స్పెషల్‌గా విష్ చేసింది. ముద్దుగా మిస్టర్ సి అని పిలుచుకునే అక్షరాలనే  గుమ్మంలో పూలతో అలంకరించింది. ఆ అక్షరాలకి ముందు మిస్టర్ అని ఒక చెప్పుమీద, సి అని మరో చెప్పుమీద లెటర్స్ ఉన్న జో్ళ్లు వేసుకుని సింపుల్‌గా నిలబడి ఉన్న ఫొటో పెట్టింది. అయితే ఆ నిలబడిన వ్యక్తి చెర్రీనో కాదో చెప్పుకోండి చూద్దాం  అని అభిమానులకు హింట్ ఇచ్చినట్లుంది సంగం మాత్రమే కనిపిస్తున్న ఆ ఫొటో. తండ్రినుంచి ఒక రోజు ముందుగానే వాచ్‌ని బహుమతిగా అందుకున్న చెర్రీకి ఈ రోజు ఉపాసన సింపుల్‌గా, స్వీట్‌గా విషెస్ చెప్పడం చరణ్‌కి సంతోషాన్నిస్తుంది. అంతకంటే పెద్ద బహుమానం సుకుమార్ చెర్రీకి ఇచ్చిన రంగస్థలం. విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com