డ్రగ్స్ స్మగ్లింగ్: నిందితుడికి ఐదేళ్ళ జైలు
- March 26, 2018
మనామా: ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్, బహ్రెయినీ వ్యక్తికి ఐదేళ్ళ జైలు శిక్షను అలాగే, 3,000 బహ్రెయినీ దినార్స్ జరీమానాని విధించింది. పాకిస్తాన్ నుంచి పచ్చడి జాడీల్లో డ్రగ్స్‌ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు నిందితుడిపై అభియోగాలు నిరూపించబడ్డాయి. 22 ఏళ్ళ నిందితుడ్ని బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీసులు మార్చి 28న అరెస్ట్ చేయడంతో డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడి అనుమానాస్పద వైఖరిని గుర్తించిన పోలీసులు, అతన్ని తనిఖీ చేయగా, 180 గ్రాముల మెథాంఫెటమైన్ (షాబుగా వ్యవహరిస్తారు) అతని వద్ద గుర్తించారు. నాలుగేళ్ళుగా ఈ డ్రగ్స్‌ని తాను వాడుతున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. పాకిస్తాన్‌లో తక్కువ ధరకే దొరికే ఆ డ్రగ్‌కి బహ్రెయిన్‌లో చాలా ధర పలుకుతోందని గమనించి, స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులకు తెలిపాడు నిందితుడు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..