సీనియర్ నటి జయంతి కి సీరియస్..ఐసీయూ లో చికిత్స

- March 27, 2018 , by Maagulf
సీనియర్ నటి జయంతి కి సీరియస్..ఐసీయూ లో చికిత్స

తెలుగు ఇండస్ట్రీలో సెంటిమెంట్ ప్రాధాన్యత గల చిత్రాల్లో నటించి అందరి మన్ననలు అందుకున్నారు నటి జయంతి. తల్లి పాత్రలో ఆమె జీవం పోసేవారు. తాజాగా సినీనటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్న ఆమె గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆమె పరిస్థితి విషమించడంతో తొలుత బెంగళూరు సిటీ ఆసుపత్రికి బంధువులు తరలించారు. చిన్నచిన్నవేషాలు వేస్తున్న రోజుల్లో కొంతమంది నిరుత్సాహ పరిచినా పట్టుదలతో కష్టపడి పైకొచ్చింది. 

ఆమె మాతృభాష తెలుగైనా కన్నడంలో ఎక్కువ చిత్రాల్లో నటించారు. కన్నడ మెగాస్టార్ రాజ్ కుమార్ తో దాదాపు 30 చిత్రాల్లో నటించారు. ఎన్.టి.రామారావుతో నటించిన జగదేకవీరుని కథ ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. బాలనాగమ్మ, స్వర్ణమంజరి, కొండవీటి సింహం లాంటి హిట్‌ సినిమాల్లో నటించారు. దర్శకులు కె.వి. రెడ్డి, కె.విశ్వనాథ్‌, కె.బాలచందర్లు ఈమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మంచి వేషాలు ఇప్పించారు. 

కన్నడ, తెలుగు, మళయాళం భాషల్లో నటించినా సొంతంగానే డైలాగులు చెప్పడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తాజాగా నటి జయంతి తీవ్ర అస్వస్థతకు లోను కావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్న వైద్యులు, ఇప్పుడే ఏమీ చెప్పలేమని అంటున్నట్టు తెలుస్తోంది. 

ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆమె శరీరంలోని మరిన్ని అవయవాలు పని చేయడం లేదని తెలుస్తోంది. నటి జయంతి తెలుగు, కన్నడ, తమిళ, మళయాల, హిందీ భాషలలో సుమారు 500 సినిమాల్లో నటించిన జయంతి, 1949,జనవరి 6న శ్రీకాళహస్తిలో జన్మించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com