ఇంటర్నేషనల్ విమెన్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్
- March 28, 2018
దుబాయ్:దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ విమెన్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్ 'వీమెటా' టీమ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 7న మినా అసాలమ్ మదినాత్ జుమైరాలో జరగనుంది. ఐడబ్ల్యుఇపి ఛైర్‌పర్సన్ ఆరుషి ని షాంక్ నేతృత్వంలో దీన్ని నిర్వహిస్తారు. ఆరుషి, ప్రముఖ కథక్ కళాకారిణి మాత్రమే కాదు, ప్రముఖ సోషల్ వర్కర్ కూడా. భారతదేశంలోని ఉత్తరాఖండ్‌కి చెందినవారు ఈమె. దుబాయ్ చాప్టర్ 2018, వందనా శ్రీవాస్తవ నేతృత్వంలో డిజైన్ చేయబడింది. ఈ వేదికపై పలు ముఖ్యమైన అంశాల గురించిన చర్చ జరుగుతుంది. విమెన్ ఎంపవర్‌మెంట్ గురించి వక్తలు తమ అభిప్రాయాల్ని ఈ వేదికపై వెల్లడిస్తారు. కెనడియన్ పార్లమెంటేరియన్ డాక్టర్ రుబీ ధల్లా, అలాగే భారతదేశానికి చెందిన పలువురు మంత్రులు, యూఏఈకి చెందిన రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాలుపంచుకుంటారు. స్త్రీ శక్తి కాన్సెప్ట్ నేపథ్యంలో ఆరుషి నాట్య ప్రదర్శన ఇక్కడ ప్రధాన ఆకర్షణ కానుంది. ఎస్‌వికె మీడియా ఈ ఈవెంట్‌ని నిర్వహించనుంది. ప్రముఖ మహిళా యాక్టివిస్టులు, సోషలిస్టులు, ఎంటర్‌ప్రెన్యూర్స్, ఆథర్స్, ప్రొఫెషనల్స్, ఆర్టిస్టులకు ఈ వేదికపై ఘన సన్మానం జరుగుతుంది. 



తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







