మళ్ళీ వస్తానని అనుకోలేదు : మలాలా
- March 29, 2018
ఇస్లామాబాద్ : నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జాయ్ కళ్ళ నుంచి గురువారం ఆనంద బాష్పాలు జలజలా స్రవించాయి. ఆమె అనూహ్యంగా తన స్వదేశానికి వచ్చి ప్రధానమంత్రి షాహిద్ కకన్ అబ్బాసీని కలిశారు. అనంతరం ఆమె అమితానందంతో మీడియాతో మాట్లాడారు. తాను మళ్ళీ తన దేశానికి వస్తానని అనుకోలేదని చెమర్చిన కళ్ళు తుడుచుకుంటూ చెప్పారు. తాను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. పాకిస్థాన్ సైన్యానికి, రాజకీయ నేతలకు, పాకిస్థానీలందరికీ ధన్యవాదాలు చెప్తున్నానని తెలిపారు. ఐదేళ్ళ నుంచి తాను స్వదేశానికి తిరిగి రావడంపై ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
బాలల విద్య కోసం తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టాలని తెలిపారు. పాకిస్థాన్లో బాలికా విద్య కోసం మలాలా ఫండ్ 6 మిలియన్ల అమెరికన్ డాలర్లను పెట్టుబడి పెట్టిందన్నారు. రాబోయే తరాలే పాకిస్థాన్ భవిష్యత్తు అని చెప్పారు.
ఆరేళ్ళపాటు లండన్లో నివసించిన మలాలా తిరిగి తన స్వదేశానికి బుధవారం అర్ధరాత్రి పాకిస్థాన్ వచ్చారు.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







