'టైమ్స్' అత్యంత ప్రభావశీలురు ఎవరో చూడండి

- March 29, 2018 , by Maagulf
'టైమ్స్' అత్యంత ప్రభావశీలురు ఎవరో చూడండి

న్యూయార్క్‌: ప్రముఖ మ్యాగజైన్‌ టైమ్స్‌ ఏటా విడుదల చేసే ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావశీలుర జాబితాలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేరు మరోసారి పరిశీలనకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రభావితం చేసే ప్రముఖ రాజకీయ నాయకులు, శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, కళాకారులు, వ్యాపారవేత్తలు, సాంకేతిక నిపుణలతో ఏటా ప్రభావశీలుర జాబితాను విడుదల చేస్తుంటుంది టైమ్స్‌ మ్యాగజైన్‌. ఏప్రిల్‌లో ఈ జాబితాను విడుదల చేయనున్నారు. ఇందుకు గానూ మోదీ సహా పలువురు ప్రముఖుల పేర్లను పరిశీలిస్తున్నారు.

ఈ ఏడాది ప్రభావశీలుల జాబితాలో చోటు కోసం మోదీతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదేళ్ల, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌, ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌, ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌, అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌, బ్రిటన్‌ రాజ కుటుంబీకులు ప్రిన్స్‌ విలియమ్‌, కేట్‌ మిడిల్టన్‌, ప్రిన్స్‌ హ్యారీ, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తదితరులు పోటీ పడుతున్నారు.

2015, 2016, 2017లో విడుదల చేసిన ప్రభావశీలుల జాబితాలోనూ ప్రధాని మోదీ స్థానం సంపాదించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com