హైదరాబాద్:ఐపీఎల్ అభిమానులకు మెట్రోరైల్ గుడ్ న్యూస్
- March 31, 2018
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2018 సీజన్ వారం రోజుల్లో అట్టహాసంగా ఆరంభంకానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో లీగ్‌లోని మిగతా జట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 7 మ్యాచ్‌లను ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒక్క మ్యాచ్(ఏప్రిల్ 22) మినహా మిగతా మ్యాచ్‌లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి వరకు జరుగుతాయి. మ్యాచ్‌లను వీక్షించడానికి వచ్చిన అభిమానులు అర్ధరాత్రి తరువాత ఇంటికి వెళ్లడానికి ఆసమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉప్పల్ స్టేడియం పక్క నుంచే హైదరాబాద్ మెట్రో రైల్ కారిడార్ వెళ్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెట్రో రైళ్లను అర్ధరాత్రి 10 గంటల వరకే నడుపుతున్నారు. మ్యాచ్‌లున్న రోజుల్లో వీటిని అర్ధరాత్రి 12:30 గంటల వరకు నడుపుతామని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ట్విటర్ ద్వారా వెల్లడించింది. మరోవైపు టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు, ఆన్లైన్లో బుక్ చేసుకున్న ఐపీఎల్ టిక్కెట్లను తీసుకునేందుకు మియాపూర్, మూసాపేట్, అమీర్‌పేట్, హబ్సిగూడ, నాగోల్, మూసారాంబాగ్ మెట్రోస్టేషన్లతో పాటు పంజాగుట్ట, హైటెక్‌సిటీ మెట్రో మాల్స్ దగ్గర టిక్కెట్లను తీసుకోవచ్చని కూడా పేర్కొంది. దీంతో పాటు రూట్ మ్యాప్స్‌ను కూడా పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







