కౌలంపూర్:తెలుగువారికి అండగా శాంతిప్రియ..
- March 31, 2018
ఢిల్లీ : మలేసియా రాజధాని కౌలాంపూర్ లో తెలుగు వారి పక్షాల శాంతిప్రియ అనే మహిళ పోరాడుతోంది. శాంతిప్రియ సహకారంతో వందలాదిమంది తెలుగువారు విముక్తి పొందుతున్నారు. ఉపాధి కోసం మలేసియా వెళ్లాలనుకునేవారిపై మోసగాళ్లు వలపన్ని మనుషులను రవాణా చేసే ముఠాలుగా తయారయి వేలాది రూపాయలను దండుకుంటున్నారు. మోసం చేసినవారిని కౌలాలంపూర్ లోని పలు సంస్థల్లో పనికి కుదురుస్తు డబ్బులు దండుకుంటున్నారు. వీరి వలలో చిక్కి తెలుగువారు బానిసలుగా మారుతున్నారు. పనిలో చేరింది మొదలు వారికి యజమానులు నరకం చూపిస్తున్నారు. దీంతో మలేషియాలో తెలుగువారి కష్టాలు వర్ణనాతీతంగా వున్నాయి. చేతిలో చిల్లి గవ్వ లేక స్వదేశం వచ్చే దారి లేక నానా తెలుగు వారు అవస్థలు గురవుతున్నారు. అటువంటివారికి అండగా కాంగ్రెస్ అనుబంధ గల్ఫ్ ఎన్ ఆర్ఐ విభాగం ఇప్పటికే అనేకమంది తెలుగువారికి అండగా నిలిచి విముక్తి కలిగించింది. కౌలాలంపూర్ లో బాధితుల పక్షాల నిలిచి శాంతిప్రియ పనిచేస్తోంది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్‌పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







