52 మంది భారత జాలర్లను అరెస్టు చేసిన పాకిస్తాన్
- April 01, 2018
తమ సముద్రజలాల్లోకి ప్రవేశించారనే నెపంతో 52 మంది భారత జాలర్లను పాకిస్తాన్ అరెస్టు చేసింది. ఈ మేరకు పాక్ అధికార వర్గాలు ఈ విషయాన్ని శనివారం దృవీకరించాయి. వారితో పాటు 8 వేట పడవలను అదుపులోకి తీసుకున్నట్లు పాకిస్తాన్ అధికారులు తెలిపారు. అరెస్ట్ చేసిన మత్స్యకారులను జుడీషియల్ రిమాండ్ కోసం కరాచీలోని మలిర్ జైలు పంపినట్లు పాక్ వర్గాలు వెల్లడించాయి. వీరంతా గుజరాత్లోని దిండి తీర ప్రాంతానికి చెందిన వారు.
రాత్రి పూట కావడంతో సరిహద్దులు గుర్తించలేక పాక్ జలాల్లోకి వెల్లినట్లు బాధితులు తెలిపారు. రెండు దేశాల మధ్య జరుగుతున్న వరుస అరెస్టులతో అమాయకులైన జాలర్లు ఏళ్లపాటు జైళ్లలో మగ్గుతున్నారు. సత్ప్రవర్తన కారణంగానో, జాతీయ పండగల సందర్భంగా ఏ ఒక్కరికో ఇద్దరికో క్షమాబిక్ష లభిస్తోంది. మిగతా వారంతా ఎప్పటికి విడుదలౌతారో తెలియక నరకం అనుభవస్తున్నారు. గత నవంబర్ నుంచి దాదాపు 200 మంది భారతీయు జాలర్లను తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారనే నెపంతో పాక్ అరెస్టు చేసింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







