కొనసాగుతున్న భారత్ బంద్ !
- April 01, 2018
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీం తన ఆదేశాలను వెనక్కు తీసుకోవాలంటూ దళిత సంఘాలు భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో బీహార్, పంజాబ్, యూపీ, ఒడిషాలో ఉదయం నుంచే ఆందోళనలు మొదలయ్యాయి. గుంపులుగా రోడ్లపైకి వచ్చిన దళిత సంఘాలు బలవంతంగా షాపులు మూయించారు.
పంజాబ్లో లుథియానా, జిర్కాపూర్ ఇంకా చాలా ప్రాంతాల్లో రోడ్లు నిర్మానుష్యం అయ్యాయి. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా బలగాలను మోహరించారు. రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగారు.
పాట్నాలో జన అధికార్ పార్టీ నేత పప్పూయాదవ్ దళిత సంఘాలకు మద్దతు ప్రకటించారు. తన కార్యకర్తలతో సహా రోడ్డుపైకి వచ్చి భారీ ర్యాలీ చేశారు. దళిత సంఘాలతో కలిసి రాస్తారోకో, రైల్ రోకో చేశారు. భారత్ బంద్ కారణంగా చాలా ప్రాంతాల్లో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







