కుప్పకూలిన వాయుసేన హెలికాప్టర్‌

- April 02, 2018 , by Maagulf
కుప్పకూలిన వాయుసేన హెలికాప్టర్‌

కేదార్‌నాథ్‌, ఉత్తరాఖండ్‌ : భారతీయ వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలికాప్టర్‌ ఉత్తరాఖండ్‌లో కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ఉన్న నలుగురు గాయాలపాలయ్యారు. ల్యాండింగ్‌ సమయంలో ఐరన్‌ గిర్డర్‌ను హెలికాప్టర్‌ను బలంగా తాకడంతో మంటలు చెలరేగాయి. రవాణా అవసరాలకు వినియోగించే ఎంఐ-17 హెలికాప్టర్‌ను కేదార్‌నాథ్‌ హెలిప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ చేస్తుండంగా ఐరన్‌ గిర్డర్‌కు తగిలి ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com