సౌదీ రీజియన్‌లో మంచు దుప్పటి
- April 03, 2018
సౌదీ అరేబియాలోని అసిర్ ప్రాంతం మంచు దుప్పటి పరుచుకుంది. ఉష్ణోగ్రతల్లో విపరీతమైన తేడాల కారణంగా ఈ పరిస్థితి చోటు చేసుకుంది. ఆరు గంటలపాటు ఈ రీజియన్‌లో వర్షం మరియు మంచు విపరీతంగా కురిశాయి. కొండలు, రోడ్లు మంచుతో నిండిపోయాయి. అల్ హుస్సేన్, అల్ ఒమర్ వ్యాలీస్ మంచు కారణంగా కొత్త అందాల్ని సంతరించుకున్నాయి. ప్రధాన నగరం అభా సాధారణ వర్షపాతాన్ని చవిచూసింది. ఖామిస్ ముషాయాత్, సరత్ ఉబైదా, తారిబ్, నిమాస్, తనుమా, బిషా, సవ్దా, ఖాయ్బార్ అల్ జనౌబ్, అల్ జవా, అల్ ఉర్కీన్, షాఫ్, కాద్రా, ఇడాదా, అల్ యజీద్ మరియు అల్ సర్హాన్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కన్పించింది. అసిర్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ డిఫెన్స్ సూచనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలంటూ సూచనలు చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!