వరల్డ్‌ ఆటిజం డే: వెలిగిపోయిన దుబాయ్‌ ఫ్రేమ్‌

- April 03, 2018 , by Maagulf
వరల్డ్‌ ఆటిజం డే: వెలిగిపోయిన దుబాయ్‌ ఫ్రేమ్‌

వరల్డ్‌ ఆటిజం డే సందర్భంగా దుబాయ్‌ ఫ్రేమ్‌ వెలుగులతో నిండిపోయింది. సన్‌సెట్‌ నుంచి సన్‌ రైజ్‌ వరకు బ్లూ కలర్‌ లైట్లతో దుబాయ్‌ ఫ్రేమ్‌ని అందంగా అలంకరించారు. ఆటిజం అనే వ్యాధి పట్ల అవగాహన పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతి యేడాదీ ఏప్రిల్‌ 2వ తేదీన వరల్డ్‌ ఆటిజం అవేర్‌నెస్‌ డేగా నిర్వహిస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కి చెందిన ఆటిజం సెంటర్‌ నుంచి పలువురు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్‌ ఫ్రేమ్‌ సిబ్బందికీ, అలాగే ఇక్కడికి వచ్చిన సందర్శకులకీ బ్యాడ్జీలను వారు అందించారు. 'లైట్‌ అప్‌ బ్లూ' పేరుతో జరిగిన ఈ క్యాంపెయిన్‌లో 18,600 భవనాలు, 142 దేశాల్లో పాలుపంచుకున్నాయి. అమెరికాకి చెందిన అడ్వొకసీ ఆర్గనైజేషన్‌ 'ఆటిజం స్పీక్స్‌' పేరుతో ఈ కార్యక్రమం చేపట్టింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com