గోధుమ రవ్వ వల్ల బరువు తగ్గవచ్చు!
- December 02, 2015
ఫాస్ట్ ఫుడ్, బయట తీసుకునే ఆహారం, చిరు తిళ్లు, ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల వయసుపైబడిన వాళ్లే కాదు.. చిన్న వయసులోనే బరువు పెరుగుతున్న వాళ్ల సంఖ్య ఎక్కువైంది. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఏది పడితే అది తినేయడం వల్ల బరువు పెరిగి అనారోగ్యం పాలవుతున్నారు వేగంగా బరువు తగ్గాలంటే వెంటనే వీటిని ప్రారంభించండి... శరీర బరువు తగ్గించుకోవడానికి చాలా మంది రకరకాల ఫీట్స్ చేస్తుంటారు. గంటలకొద్దీ వ్యాయామం, డైటింగ్, వేళకు తినకుండా కడుపుమాడ్చుకుంటూ ఉంటారు. అయితే బరువు తగ్గించుకోవాలంటే ఆహారం మానేయకూడదు. పోషకాలుండే బరువు తగ్గించే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చు. ఆరోగ్యంగానూ జీవించవచ్చు. 7 డేస్ డైట్ ప్లాన్ తూచా తప్పకుండా పాటిస్తే బరువు తగ్గడం తేలికే గోధుమ రవ్వ లేదా ఉప్మా రవ్వ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. గోధుమల ద్వారా తీసిన ఈ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ B ఉంటాయి. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గేందుకు పోషకాలతో పాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి గోధుమరవ్వను డైట్ లో చేర్చుకుంటే.. త్వరగా బరువు తగ్గవచ్చు. ఇంతకీ వెయిట్ లాస్ కి గోధుమ రవ్వ ఎలా ఉపయోగపడుతుంది. కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్న కాసేపటికే ఆకలి కలిగిస్తాయి. అయితే తక్కువ పరిమాణంలోనే తీసుకునే గోధుమరవ్వ చాలా సమయం ఆకలి కాకుండా చేస్తుంది. రోజూ స్నాక్స్ టైంలో గోధుమరవ్వతో చేసిన ఆహారం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గించుటకు బాగా సహకరిస్తాయి. వీటిలో ఎక్కువ మోతాదులో పోషకాలు, తక్కువ క్యాలోరీలు ఉంటాయి. రోజు గోధుమ రవ్వను తింటే శరీరానికి తక్కువ క్యాలరీలు అందుతాయి. గోధుమ రవ్వలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సజావుగా జరగడానికి సహాయపడుతుంది. శరీరంలోని అన్ని భాగాల విధులు ఆరోగ్యకరంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. తీసుకున్నఆహారం చక్కెరగా మారకుండా ఈ గోధుమ రవ్వ చూస్తుంది. దీనివల్ల రక్తంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వాళ్లు మీ రోజువారీ డైట్ లో గోధుమరవ్వను చేర్చుకోవడం మంచిది. జీవక్రియ వేగంగా జరగటం వల్ల క్యాలోరీలు ఎక్కువగా ఖర్చై, శరీర బరువు తగ్గుతుందని చాలామంది భావిస్తారు. కానీ వేగంగా జీవక్రియ జరగటం వల్ల త్వరగా ఆకలి కలిగి, ఎక్కువ క్యాలోరీలు తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల శరీరంలో కొవ్వు శాతం పెరిగి బరువు పెరుగుతారు. గోధుమ రవ్వ తినటం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా సాగుతుంది. దీనివల్ల ఆకలి కలుగదు. గోధుమ రవ్వలో పుష్కలంగా ప్రోటీన్ లు ఉంటాయి. తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఇలా కొవ్వు పదార్థాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఈజీగా శరీర బరువు తగ్గించుకోవచ్చు. గోధుమరవ్వను జీర్ణాశయం గ్రహించడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల త్వరగా ఆకలి అనిపించదు. పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ ఉండటం వల్ల మరో ఆహారం తీసుకోకుండా ఉంటారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







