50 దేశాల్లో యూఏఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు అనుమతి

- April 04, 2018 , by Maagulf
50 దేశాల్లో యూఏఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు అనుమతి

యూఏఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌కి ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాల్లో అనుమతి లభిస్తోంది. యూఏఈలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నవారు, ఈ యాభై దేశాల్లో ఆ లైసెన్స్‌తో డ్రైవింగ్‌ చేసేందుకు అనుమతించబడ్తున్నారు. అమెరికా, యూకే, ఐర్‌లాండ్‌, సింగపూర్‌, న్యూజిలాండ్‌ మరియు యూరోపియన్‌ యూనియన్‌లోని జర్మనీ, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌, ఇటలీ, బెల్జియం, నార్వే మరియు స్పెయిన్‌లలోనూ ఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌కి గుర్తింపు వుంది. మినిస్ట్రీ ఆఫ్‌ ఫారిన్‌ ఎఫైర్స్‌ మరియు ఇంటర్నేషనల్‌ కోఆపరేషన్‌ తమ వెబ్‌సైట్‌లో ఈ వివరాల్ని పొందుపర్చింది. ప్రపంచ వ్యాప్తంగా వున్న 50 దేశాల్లో అరబ్‌కి చెందిన 20 దేశాలు యూఏఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌ని గుర్తించాయి. యూఏఈ లైసెన్స్‌ని వివిధ దేశాల్లో ఉపయోగించడానికి సంబంధించి కొన్ని షరతులు కూడా వున్నాయి. ఆయా దేశాల్ని బట్టి, ఆ షరతులు వర్తిస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com