మానవులందరికీ హెచ్చరిక!
- May 06, 2015
నేపాల్ లోని ఖాట్మండు ప్రాంతంలో సంభవించిన పెను భూకంపం కొన్నివేల ప్రాణాలను బలిగొన్నది. మరొక మారు నిద్రావస్థలో ఉన్న ప్రపంచాన్ని దేవుడు ఒక్కసారి తట్టిలేపాడు, ఈ క్రింది విధంగా అందరికీ హెచ్చరిక జారీ చేసాడు:
"నేను మానవ జాతిని సృష్టించాను. కొన్ని పరిమితులను, హద్దులను నిర్దేశించాను. మీరు వీటికి 'మానవతావిలువలు' అని పేరు పెట్టారు. నేను మిమ్మల్ని సృష్టిస్తే, మీరు డబ్బుని కనిపెట్టారు.నా దృష్టిలో అందరూ సమానమైతే మీ దృష్టిలో అశాశ్వతమైన 'డబ్బు'ని సంపాదించడంలో మానవతావిలువలకు తిలోదకాలిచ్చి, అశాశ్వతమైన సుఖాలకి అలవాటుపడి, మీ మనుగడకి మీరే ప్రశ్నార్ధకంగా మారుతున్నారు. మీరు సంపాదించే ఆస్తులు, అంతస్తులు, హోదా, డబ్బు, చివరికి మీ జీవితం...అన్నీ అశాశ్వతమే అని మరొక్కసారి మీకందరికీ తెలియజేయడానికి నిన్నటి భూకంపం ద్వారా చిన్న హెచ్చరిక జారీ చేసాను. మీకు తెలివి చాలా ఎక్కువ. ఈ పాటికీ అర్ధమయుంటుంది నేను చెప్పాలనుకునే విషయం! మానవతావిలువలపట్ల నమ్మకం, నా యందు విశ్వాసం, శ్రేయస్సుకోసం సమాజం, ఆత్మీయతులపట్ల అనురాగం, ప్రకృతి మరియు ఇతర జీవకారుణ్యాలపట్ల మమకారం పెంపొందించే ఆలోచనా సరళిని అలవర్చుకోండి."
..ప్రయత్నిస్తే, ఆచరణలో సాధ్యంగాని విషయం ఉండదు గనక, దేవుని సందేశాన్ని మనమంతా పాటిద్దాం!
--- ఎస్.పి. సోమసుందర్, దుబాయ్.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







