బీసిసిఐ భారీ జాక్పాట్
- April 05, 2018
టీమిండియా ఆడే మ్యాచ్ల ప్రసార హక్కుల వేలంలో బీసిసిఐ మరోసారి భారీ జాక్పాట్ కొట్టింది. వచ్చే ఐదేళ్ళలో సొంతగడ్డపై భారత్ ఆడనున్న మ్యాచ్ల ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ 6138 కోట్లకు దక్కించుకుంది. రెండురోజులుగా సాగిన ఈ వేలంలో స్టార్ నెట్వర్క్ రిలయన్స్, సోనీలను వెనక్కి నెట్టింది. దీంతో ఒక్కో మ్యాచ్కు సగటున 60 కోట్లు చెల్లించనుంది. గత సీజన్లో 3851 కోట్లకు మీడియా రైట్స్ దక్కించుకున్న స్టార్ ఈ సారి దాని కంటే 59 శాతం ఎక్కువగా వెచ్చించింది. 2018 నుంచి 2023 వరకూ టీమిండియా 102 మ్యాచ్లు ఆడనుండగా... తొలిసారి మీడియా హక్కులు భారీ స్థాయిలో అమ్ముడుపోయాయి. ఇప్పటికే స్టార్ నెట్వర్క్ ఐపీఎల్ ప్రసార హక్కులను కూడా 16వేల కోట్లకు పైగా వెచ్చించి దక్కించుకుంది. దీంతో రానున్న ఐదేళ్ళలో కేవసం ప్రసార హక్కుల అమ్మకం ద్వారానే 22 వేల కోట్ల వరకూ బీసిసిఐ ఆర్జించబోతోంది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







