ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీగా భీమా కవరేజ్
- April 07, 2018
ఈ ఏడాది ఐపీఎల్ ట్వెంటీ20 క్రికెట్ లీగ్ బీమా కంపెనీలకు కాసులు కురిపిస్తోంది. నేటి నుంచి మే 27 వరకు ఐపీఎల్ సీజన్ కొనసాగనున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ కోసం అన్ని కేటగిరీల్లో కలిపి ఏకంగా రూ.2,500 కోట్లకు ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోవడం విశేషం. గతేడాది జరిగిన బీమా రూ1,300 కోట్లు కాగా, ఈ సారి ఏకంగా రెట్టింపు కావడం గమనార్హం.
ఒక్కో ఐపీఎల్ జట్టుపై రూ.40 కోట్ల బీమా తీసుకున్నారు. ఐపీఎల్ ఈవెంట్ కోసం ప్రసార మాధ్యమాలు తీసుకున్న రూ.1,500 కోట్ల బీమా కవరేజీ కూడా ఇందులో ఉంది. ఒకవేళ ఐపీఎల్ మ్యాచ్ లు కేన్సిల్ అయినా, ఆలస్యమైనా అందుకు వాటిల్లే నష్టాన్ని బీమా పరిహారం రూపంలో పూడ్చుకునేందుకు కంపెనీలు ఈ స్థాయిలో బీమా తీసుకున్నాయి.
ఇక మ్యాచ్ ల సమయంలో ఆటగాళ్లకు అయ్యే గాయాలకు కూడా కవరేజీ ఉంది. ఆటగాళ్ల ఫీజుల నష్టంపైనా బీమా తీసుకోవడం విశేషం. పరిహారం కోసం క్లెయిమ్ లు పెరిగిపోవడంతో ఈ ఏడాది బీమా సంస్థలు పాలసీల ప్రీమియాన్ని పెంచేశాయి.
తాజా వార్తలు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్







