ఫిల్మ్‌ ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన

- April 07, 2018 , by Maagulf
ఫిల్మ్‌ ఛాంబర్ ముందు శ్రీరెడ్డి అర్థనగ్న ప్రదర్శన

సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్న సినీనటి శ్రీరెడ్డి ... ఇప్పుడు ఆ రగడను ఏకంగా ఫిల్మ్‌ ఛాంబర్ ముందుకు తీసుకొచ్చింది. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్ కార్డు ఇవ్వనందుకు నిరసనగా.. ఛాంబర్‌ ముందు అర్థనగ్న నిదర్శనకు దిగింది. ఉదయాన్నే ఛాంబర్ దగ్గరకు వచ్చేసిన శ్రీరెడ్డి.. దుస్తులు విప్పేసి ధర్నా చేసింది. ఆమె చేసిన పనితో.. అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.

తాను మూడు సినిమాలు చేసినా కార్డ్‌ ఇవ్వడం లేదంటూ వాపోయింది శ్రీరెడ్డి. కార్డ్ కోసం దరఖాస్తు చేసుకుని వారం రోజులైనా ఇంతవరకూ ఇవ్వనందుకే  ఆందోళనకు దిగాల్సి వచ్చిందని ప్రకటించింది. సినిమా ఛాన్సులు అడుగుతుంటే.. హాట్ వీడియోలు కావాలంటున్నారని..  అందుకే నేరుగా ఛాంబర్ ముందే అర్థనగ్న నిరసనకు దిగానంది శ్రీరెడ్డి. కార్డ్ ఇవ్వకపోతే, నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com