బహ్రెయిన్ లో సేద తీరుతున్న రవిశాస్త్రి
- April 08, 2018
రవిశాస్త్రి తెలుసు కాదా? అదేనండీ.. మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా కోచ్. ఈ వయసులో అతనికి రేసింగ్ ట్రాక్‌పైన ఏం పని అని అనుకుంటున్నారా? అతను రేసింగ్ టీమ్ తరఫున బరిలో దిగుతున్నాడనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. విషయం ఏంటంటే.. దాదాపు రెండు నెలల పాటు జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగనున్న విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ ఆటగాళ్లతో పాటు దేశవాళీ ప్లేయర్లు, విదేశీ ఆటగాళ్లు దాదాపు అందరూ ఏదో ఒక ఫ్రాంచైజీ తరఫున బరిలోకి దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో భారత జాతీయ క్రికెట్ జట్టు కోచ్, సహాయసిబ్బందికి పూర్తి విరామం దొరికింది. ఊపరిసలపని షెడ్యూళ్లతో, తీరికలేని మ్యాచ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే వీరంతా ప్రస్తుతం హాలీడేని ఎంజాయ్ చేస్తున్నారు. కాస్త.. విరామం లభించడంతో కోచ్ రవిశాస్త్రి బహ్రైన్ గ్రాండ్ ప్రి ఫార్ములావన్ రేస్ చూసేందుకు వెళ్లాడు. చాలా ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ఫొటోలను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







