కాన్‌క్లేవ్‌ ఆఫ్‌ యోగా ఆర్గనైజేషన్స్‌ని నిర్వహించిన ఇండియన్‌ ఎంబసీ

- April 08, 2018 , by Maagulf
కాన్‌క్లేవ్‌ ఆఫ్‌ యోగా ఆర్గనైజేషన్స్‌ని నిర్వహించిన ఇండియన్‌ ఎంబసీ

మస్కట్‌: కాన్‌క్లేవ్‌ ఆఫ్‌ యోగా ఆర్గనైజేషన్స్‌ని ఇండియన్‌ ఎంబసీ ఏప్రిల్‌ 6న నిర్వహించింది. 4వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో కర్టెన్‌ రైజర్‌ ప్రోగ్రామ్‌గా దీన్ని నిర్వహించారు. 2018 జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే. సుల్తానేట్‌ పరిధిలో పెద్ద సంఖ్యలో యోగా ఆర్గనైజేషన్స్‌ అలాగే టీచర్స్‌ ఈ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్నారు. జూన్‌ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించుకోవడం ఆనందంగా వుందనీ, యోగాని విశ్వవ్యాపితం చేయడంలో భారత ప్రధాని నరేంద్రమోడీ కృషి మరవలేనిదని భారత అంబాసిడర్‌ ఇంద్రా మణి పాండే చెప్పారు. గత ఏడాది 4,500 మందికి పైగా ఒమనీ మరియు భారత యోగా ఔత్సాహికులు, ప్రాక్టీషనర్స్‌, బిగినర్స్‌ ఈ యోగా దినోత్సవ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ ఏడాది మరింత ఘనంగా యోగా దినోత్సవ వేడుకల్ని నిర్వహించనున్నట్లు ఇండియన్‌ ఎంబసీ పేర్కొంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com