ఏడాదిలో 3.68 కోట్ల ఉద్యోగాలు
- April 09, 2018
బీజింగ్ : చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ భారీగా ఉద్యోగావకాశాలను కల్పించింది. వ్యాపార విస్తరణలో భాగంగా భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించనుంది. తాజా నివేదికల ప్రకారం 2017 సంవత్సరంలో 3.68 కోట్ల ఉద్యోగాలు కల్పించినట్టు ఓ సర్వే ద్వారా వెల్లడైంది. అలీబాబా గ్రూప్ నిర్వహిస్తున్న వివిధ సంస్థల ద్వారా 50కోట్ల వినియోగదారులకు సేవలందిస్తుందని, అన్‌లైన్ రిటైల్ విభాగంలోనే కొత్తగా 1.4 కోట్ల ఉద్యోగాలను కల్పించినట్టు పేర్కొంది. ముఖ్యంగా టెక్స్‌టైల్స్, నిత్యవసరాలు, గృహోపకరణాల విభాగాలు ఈ నియామకాల్లో అగ్రభాగాన ఉన్నాయని తెలిపింది.
ఆర్ అండ్ డీ, డిజైన్, తయారీ, లాజిస్టిక్స్ రంగాల్లోని నిపుణలకు డిమాండ్ పెరగడానికి అన్‌లైన్ రిటైల్ సేవల విస్తరణ ఎంతగానో దోహదపడినట్టు, కేవలం ఈ రంగాల్లోనే 2.27 కోట్ల ఉద్యోగాలు కల్పించగలిగారని నివేదించింది. గత ఏడాదితో పోల్చితే 2017 నాలుగో త్రైమాసికంలో ఆదాయంలో 56 శాతం వృద్ధి సాధించినట్టు అలీబాబా గ్రూప్ పేర్కొంది. భవిష్యత్తులో ఈ కామర్స్ రంగం మరింత కీలకంగా మారనున్నట్టు వెల్లడించింది. వ్యాపార విధానాలను సంస్కరించడం, అఫ్‌లైన్ రిటైల్ వ్యాపారాన్ని డిజిటల్ టెక్నాలజీతో అనుసంధానించడం ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని ఈ రిపోర్ట్ తెలిపింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







