ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటాము: ప్రముఖ దర్శకుడు

- April 09, 2018 , by Maagulf
ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటాము: ప్రముఖ దర్శకుడు

చెన్నైలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ లను అడ్డుకుంటామని దర్శకుడు సెల్వమణి, భారతీరాజా, నటుడు సత్యరాజ్ తదితరులు స్పష్టం చేశారు. తమిళనాడు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కావేరీ సమస్య, స్టెరిలైట్ కాపర్ సమస్యలతో ప్రజలు ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్నారని దీనిపై స్పందించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరొత్తినట్లుగా వ్యవహరిస్తోందని సెల్వమణి ఆరోపించారు. రైతులు, ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో ఐపీఎల్ పోటీ చెన్నైలో నిర్వహించడం ప్రజలను ఇబ్బందులు పెట్టడమేనన్నారు. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేసాలను బేఖాతరు చేస్తూ, దక్షిణాది రాష్ట్ట్రాలపై వివక్ష చూపుతోందన్నారు..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com