రన్‌వే మూసివేత.. 225 విమానాలు రద్దు
- April 09, 2018
ముంబయి: రుతుపవనాల ముందు చేపట్టే నిర్వహణ పనుల కారణంగా ముంబయి ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్రధాన రన్‌వేను 6 గంటల పాటు మూసివేయడంతో సోమవారం 225కు పైగా విమానాలు రద్దయ్యాయి. మరో 70 విమానాల వేళలు మార్చారు. ప్రధానంగా జెట్ ఎయిర్వేస్, ఎయిర్ ఇండియా , ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయర్, విస్టారా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (ఎంఐఏఎల్) నిర్వహిస్తున్న ఈ రన్‌వేను సోమ, మంగళవారాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య నిర్వహణ పనుల నిమిత్తం మూసివేయనున్నట్లు ఆ సంస్థ ఇప్పటికే ప్రకటించింది. కాగా జెట్ ఎయిర్వేస్ 54 దేశీయ సర్వీసులు సహా మొత్తం 70 విమానాలను రద్దు చేసింది. మరో 70 విమానాల వేళల్లో మార్పులు చేసింది. ఎయిర్ ఇండియా 34 విమానాలను నడపరాదని ముందే నిర్ణయించింది. ఈమేరకు ముందస్తుగానే ప్రయాణికులకు సమాచారం కూడా అందించినట్లు ఆ సంస్థ తెలిపింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే రెండో విమానాశ్రయమైన ఇక్కడ 09/27 (ప్రధాన), 14/32 (రెండో) రన్‌వేలున్నాయి. ఇందులో ప్రధాన రన్‌వేపై గంటకు 48 విమానాల రాకపోకలకు వీలుండగా.. రెండోది 35 విమానాల రాకపోకల సామర్ధ్యంతో ఉంది. ప్రతిరోజూ ఈ విమానాశ్రయానికి సగటున 970 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
తాజా వార్తలు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..







