దుబాయ్‌ - అబుదాబీ: ఆర్‌టిఎ లగ్జరీ బస్‌ ఫ్లీట్‌

- April 09, 2018 , by Maagulf
దుబాయ్‌ - అబుదాబీ: ఆర్‌టిఎ లగ్జరీ బస్‌ ఫ్లీట్‌

రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ, దుబాయ్‌ - అబుదాబీ మధ్య ప్రయాణీకుల కోసం లగ్జరీ బస్సుల్ని ప్రారంభించనుస్త్రంది. వాల్వో కోచెస్‌, వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తామనీ, హై ఎండ్‌ ఫీచర్స్‌ వీటిల్లో వుంటాయని అధికారులు తెలిపారు. రూమీ సీట్స్‌, ఫ్రీ ఇంటర్నెట్‌, యూఎస్‌బీ పోర్టల్స్‌ (ఫోన్‌ ఛార్జింగ్‌ కోసం), ఫుట్‌ రెస్ట్స్‌, కప్‌ హోల్డర్స్‌ ఈ బస్సులో అదనపు సౌకర్యాలు. హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ కారణంగా ప్రయాణీకులకు అత్యంత సౌకర్యవంతంగా వుండనున్నాయి ఈ బస్సులు. మెనా రీజియన్‌లో ఈ తరహా బస్సుల్ని తొలిసారిగా ప్రవేశపెడుతున్నారు. 465 మిలియన్‌ దిర్హామ్‌ల ప్రోగ్రామ్‌లో భాగంగా మొత్తం 316 బస్సులు రావాల్సి వుండగా, మొదట 143 కోచ్‌లు అందుబాటులోకి వస్తాయి. 2019 నాటికి ఈ సంఖ్య 2085కి చేరుతుంది. దుబాయ్‌లో మాస్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్స్‌ని మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ చర్యలు చేపట్టినట్లు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఛైర్మన్‌, డైరెక్టర్‌ జనరల్‌ మట్టర్‌ అల్‌ తాయెర్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com