అరద్‌ కోస్ట్‌లో లభ్యమైన మృతదేహం గుర్తింపు

- April 09, 2018 , by Maagulf
అరద్‌ కోస్ట్‌లో లభ్యమైన మృతదేహం గుర్తింపు

మనమా: అరద్‌ కోస్ట్‌ దగ్గర లభ్యమైన మృతదేహాన్ని గుర్తించారు. బహ్రెయినీ కోస్ట్‌ గార్డ్స్‌ ఈ మృతదేహాన్ని తొలుత గుర్తించారు. చనిపోయిన వ్యక్తిని 28 ఏళ్ళ ఆసియా వాసిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో ఈ వ్యక్తి గల్లంతయినట్లు తెలుస్తోంది. ఆసియా జాతీయుడైన సోసాయ్‌ ఆథియాగు కిర్విన్‌ పాల్‌ జెరోమ్‌గా మృతుడ్ని నిర్ధారించారు. ముహర్రాక్‌ ఫిషింగ్‌ హార్బర్‌ - అరద్‌ కోస్ట్‌ వద్ద మృతదేహం లభ్యమయినట్లు ఇప్పటికే మినిస్ట్రీ ట్విట్టర్‌ ద్వారా ప్రకటించిన సంగతి తెల్సిందే. సాసోయ్‌ మృతికి గల కారణాలపై విచారణ జరుగుతోంది. లీగల్‌ పార్మాలిటీస్‌ పూర్తయ్యాక మృతదేహాన్ని మృతుడి స్వదేశానికి పంపనున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com