యూఏఈలో వర్షం: వీకెండ్‌లోనూ ఇదే పరిస్థితి
- April 11, 2018
యూఏఈలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఈ రోజు మరికొన్ని చోట్ల వర్షం కురుస్తుందనీ, సాధారణ వర్షం నమోదవచ్చనీ, కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షం కూడా కురిసే అవకాశం వుందని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. అబుదాబీ, దుబాయ్, షార్జా, రస్ అల్ ఖైమా, అల్ అయిన్, ఉమ్ అల్ కువైన్‌లలో ఈ రోజు ఉదయం తేలికపాటి జల్లులు కురిశాయి. వారాంతంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని, పౌరులు అప్రమత్తంగా వుండాలని ఎన్‌సిఎం హెచ్చరించింది. తేలికపాటి తాజా గాలులు వీయనున్నాయి కొన్ని చోట్ల. మరికొన్ని చోట్ల ధూళి విపరీతంగా వుండొచ్చు. సముద్రం మోస్తరు నుంచి రఫ్‌గా వుండొచ్చు. అరేబియా గల్ఫ్, ఒమన్ సముద్ర తీర ప్రాంతాల్లో మేఘాల తీవ్రత ఎక్కువగా వుంటుంది.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!







