కశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో తెలుగు జవాన్ వీరమరణం
- April 12, 2018
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన ఆర్మీ జవాన్ సాద గుణాకరరావు కశ్మీర్ ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందాడు. అతడికి తల్లిదండ్రులు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా మృత్యువాత పడడం ఆ తల్లిదండ్రులను కలచి వేస్తుంది. ఇంటర్ పూర్తయిన తరువాత 2012లో ఆర్మీలో చేరిన గుణాకర్ పంజాబ్లోని పఠాన్ కోట్ యూనిట్లో వెహికల్ డ్రైవర్గా పనిచేసేవాడు. అక్కడినుంచి శ్రీనగర్ రాష్ట్రీయ రైఫిల్ విభాగం-1కి బదిలీ అయ్యాడు. దగ్గరలోని కుల్గామ్ జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో అందడంతో మంగళవారం రాత్రి 11.30 గంటలకు కొంతమంది సైనికులు అక్కడకు చేరుకున్నారు. వారిలో గుణాకర్ కూడా ఉన్నాడు. వీరు అక్కడకు చేరుకునే లోపే ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో గుణాకర్ శరీరంలోకి తూటాలు దూసుకు వెళ్లాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గుణాకర్ను ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో బుధవారం తెల్లవారు ఝామున3.30 గంటలకు వీరమరణం చెందాడు. గుణాకర్ మరణ వార్త విని తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్లు కన్నీరు మున్నీరవుతున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







