హీరోయిన్ల పరిస్థితి దారుణం: ప్రణీత
- April 12, 2018
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా కాస్టింగ్ కౌచ్ గురించి ఎన్నో వివాదాలు తెరపైకి వస్తున్నాయి. హాలీవుడ్ లో కూడా కాస్టింగ్ కౌచ్ పై పెను వివాదాలు చెలరేగాయి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై గత కొన్ని రోజులుగా ఇంటర్వ్యూలతో దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురి ఫోటోలు..ఛాటింగ్ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. దీంతో కొంత మంది నటీమణులు, జూనియర్ ఆర్టిస్టులు సైతం ఇండస్ట్రీ భాగోతాలు బయటపెడుతున్నారు.
పవన్ కళ్యాన్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించిన కన్నడ బ్యూటీ ప్రణిత ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది..ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెరపైన అందానికే ప్రాతినిధ్యం ఇచ్చే హీరోయిన్ పాత్రతో పాటు.. నిజంగా తెర వెనుక ఏ నిర్ణయాల్లోనూ ఆమెను భాగస్వామ్యం కానివ్వరని ఆవేదన చెందారు. సినిమా తీసే ముందు చెప్పే కథకు తీసే కథకు పొంతన ఉండదని, అడిగినా.. ఇష్టం ఉంటే చేయి లేకపోతే లేదు అన్నట్లుగా దురుసుగా ప్రవర్తిస్తారని చెప్పింది.
ఈ సందర్భంగా తనకు ఎదుదైన ఓ అనుభవనాన్ని వివరించింది ప్రణీత. మన దేశంలో సంప్రదాయ సినిమాల్లో నటించే వారికంటే పోర్న్ స్టార్స్ కే విలువ ఉందని అన్నారు. ఇక్కడ సంప్రదాయ సినిమాలకు ఒక కథ చెప్పి సంతకం చేయించుకుంటారు. ఆతర్వాత వారి ఇష్టం వచ్చిన సీన్లు తీస్తారు. సెట్‌లో ఉన్న అందరికంటే హీనంగా హీరోయిన్లనే చూస్తారు.
మరీ దౌర్భాగ్యం ఏంటంటే.. ఓ చిత్రంలో డాన్స్ విషయంలో అభ్యంతరం చెప్పితే కోరియోగ్రాఫర్‌కూడా ఆగ్రహం వ్యక్తం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా హీరోయిన్లు ఇలాంటి విషయాల్లో గట్టిగా మాట్లాడితే..ఆ హీరోయిన్ కి పొగరు అంటూ రూమర్లు సృష్టిస్తారని వాపోయింది. హీరోయిన్ అంటై ఐటెం సాంగ్‌లు, ఏడ్చినా, నవ్వినా, బాధపడ్డా ఏ యాక్షన్‌లోనైనా అందంగా కనిపించే వస్తువుగానే చూస్తున్నారని ఆవేదన చెందారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







