టీవీ వాల్యూమ్ గొడవ: రూమ్ మేట్ హత్య
- April 12, 2018
అబుదాబీలో ఓ కార్మికుడు, తన రూమ్మేట్ని కేవలం టీవీ వాల్యూమ్ గొడవ కారణంగా హత్య చేసిన ఘటన అందర్నీ కలచివేసింది. తాను నిద్రపోయేందుకు సిద్ధమవుతున్న సమయంలో రూమ్మేట్ వాల్యూమ్ పెంచడంతో ఆగ్రహానికి గురైనట్లు నిందితుడు విచారణలో పేర్కొన్నాడు. ఈ కేసులో నిందితుడు ఆసియాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అబుదాబీ క్రిమినల్ కోర్టులో నిందితుడు ట్రయల్ ఎదుర్కొంటున్నాడు. టీవీ వాల్యూమ్ విషయంలో తలెత్తిన గొడవ ముదిరి పాకాన పడ్డంతో, ఆసియాకి చెందిన వ్యక్తి, తన రూమ్ మేట్‌ని కత్తితో కడుపులో బలంగా పొడిచాడు. ఈ గొడవని మరో రూమ్ మేట్ ప్రత్యక్షంగా చూశాడు. పోలీసులకు ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం మేరకు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. అయితే నిందితుడు తొలుత తన నేరాన్ని అంగీకరించలేదు.
తాజా వార్తలు
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!