స్మగ్లింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్: ముగ్గురి అరెస్ట్
- April 12, 2018
మస్కట్: హ్యూమన్ ట్రాఫికింగ్, నార్కోటిక్స్‌ని స్మగ్లింగ్ చేయడం వంటి నేరాలకు సంబంధించి ముగ్గురు వలసదారుల్ని సుల్తానేట్ పరిధిలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. ఓ కేసులో ఇద్దరు వలసదారుల్ని విలాయత్ ఆఫ్ లివా కోస్ట్‌లో అరెస్ట్ చేశారు. వీరిని ఇల్లీగల్ మైగ్రెంట్స్‌గా గుర్తించారు. మరో కేసులో బిద్బిద్ ప్రాంతంలో అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌ని వియ్రిస్తుండడం, హ్యూమన్ ట్రాఫికింగ్‌కి పాల్పడటం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి. స్మగ్లింగ్ బోట్ ద్వారా మనుషుల్ని సుల్తానేట్‌లోకి తీసుకురావడం, డ్రగ్స్‌ని సైతం తీసుకురావడం చేస్తున్నారని నిందితుల గురించిన వివరాల్ని పోలీసులు వెల్లడించారు. అల్ దఖ్లియా గవర్నరేట్ పోలీస్ నాయకత్వంలో యాంటీ నార్కోటిక్స్ అండ్ సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్సెస్ డిపార్ట్మెంట్ ఆసియా జాతీయుడ్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. నిందితుల్ని జ్యుడీషియల్ అథారిటీస్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు