టీవీ వాల్యూమ్‌ గొడవ: రూమ్‌ మేట్‌ హత్య

- April 12, 2018 , by Maagulf
టీవీ వాల్యూమ్‌ గొడవ: రూమ్‌ మేట్‌ హత్య

అబుదాబీలో ఓ కార్మికుడు, తన రూమ్‌మేట్‌ని కేవలం టీవీ వాల్యూమ్‌ గొడవ కారణంగా హత్య చేసిన ఘటన అందర్నీ కలచివేసింది. తాను నిద్రపోయేందుకు సిద్ధమవుతున్న సమయంలో రూమ్‌మేట్‌ వాల్యూమ్‌ పెంచడంతో ఆగ్రహానికి గురైనట్లు నిందితుడు విచారణలో పేర్కొన్నాడు. ఈ కేసులో నిందితుడు ఆసియాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అబుదాబీ క్రిమినల్‌ కోర్టులో నిందితుడు ట్రయల్‌ ఎదుర్కొంటున్నాడు. టీవీ వాల్యూమ్‌ విషయంలో తలెత్తిన గొడవ ముదిరి పాకాన పడ్డంతో, ఆసియాకి చెందిన వ్యక్తి, తన రూమ్‌ మేట్‌ని కత్తితో కడుపులో బలంగా పొడిచాడు. ఈ గొడవని మరో రూమ్‌ మేట్‌ ప్రత్యక్షంగా చూశాడు. పోలీసులకు ఆ వ్యక్తి ఇచ్చిన సాక్ష్యం మేరకు నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. అయితే నిందితుడు తొలుత తన నేరాన్ని అంగీకరించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com