బ్యాంక్ ఎంప్లాయీకి లంచం: ఇద్ద్గరికి జైలు
- April 13, 2018
ఇద్దరు వ్యక్తులకు న్యాయస్థానం మూడేళ్ళ జైలు శిక్ష విధించింది. వీరిలో ఒకరు పాకిస్తానీ కాగా మరొకరు ఇండియన్. అలాగే ఈ ఇద్దరికీ 40,000 దిర్హామ్‌ల జరీమానా సైతం విధించింది. శిక్ష అనంతరం వీరు స్వదేశానికి డిపోర్టేషన్ చేయబడ్తారు. బ్యాంకు ఉద్యోగి ఒకరికి లంచం ఇచ్చి, తద్వారా తమ పనుల్ని పూర్తి చేసుకోవాలని నిందితులు ప్రయత్నించినట్లు నిందితులపై అభియోగాలుఏ మోపబడ్డాయి. విచారణలో వీరిపై నేరాల్ని నిరూపించారు. ఈ కేసులో మరో భారతీయ వ్యక్తి, పాకిస్తానీ వ్యక్తికి క్లీన్ చిట్ ఇచ్చింది న్యాయస్థానం. ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా లోన్లు పొందేందుకు నిందితులు యత్నించారు. ఇందుకుగాను బ్యాంకు ఉద్యోగికి లోన్ అమౌంట్‌లో 10 శాతం లంచంగా ఎరచూపారు. 2017 ఫిబ్రవరి 1న ఈ ఘటన చోటు చేసుకుంది. మురాక్కాబాత్ పోలీస్ స్టేషన్‌లో మార్చి 1న ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







