50 శాతం డిస్కౌంట్‌తో ట్రాఫిక్‌ ఫైన్‌

- December 04, 2015 , by Maagulf
50 శాతం డిస్కౌంట్‌తో ట్రాఫిక్‌ ఫైన్‌

 

వాహనదారులకు 50 శాతం ట్రాఫిక్‌ ఫైన్‌ డిస్కౌంట్‌ను మరో నెల రోజులపాటు పొడిగించినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఉమ్‌ అల్‌ కువైన్‌ పోలీస్‌ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. డిసెంబర్‌ 2 నుంచి జనవరి 2 వరకూ పొడిగించిన గడువు అమల్లో ఉంటుంది. ట్రాఫిక్‌ మరియు పెట్రోల్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ సయీద్‌ ఒబైద్‌ బిన్‌ అరన్‌ మాట్లాడుతూ, చాలామంది వాహనదారులు ఈ నిర్ణయం ద్వారా లబ్ది పొందుతున్నట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాలతో మరణాలకు కారణమయినవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ వర్తించదని ఆయన చెప్పారు. అతి వేగంతో ప్రయాణించే వాహనాలు, రెడ్‌ సిగ్నల్స్‌ని క్రాస్‌ చేసేవారు, రేసులకు పాల్పడేవారు, విండోస్‌ టింట్లింగ్‌ వంటి నిబంధనల్ని ఉల్లంఘించేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని బిన్‌ అరన్‌ స్పష్టం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com