కలరా నియంత్రణకు బహ్రెయిన్ కఠిన చర్యలు
- December 04, 2015
దేశంలో కలరా విజృంభించకుండా, ఇతర దేశాల నుంచి బహ్రెయిన్‌కి వచ్చేవారి ద్వారా కలరా వ్యాప్తి పెరగకుండా వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోనుంది. విమానాశ్రయాల్లో ఇరవై నాలుగ్గంటలూ కలరాపై అవగాహన కల్పించేలా, కలరా కేసుల్ని గుర్తించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు. ప్రైమరీ హెల్త్‌కేర్ మరియు పబ్లిక్ హెల్త్ ప్రతినిథి డాక్టర్ వలీద్ అల్ మనీయా, కలరా పట్ల తాము అప్రమత్తంగా ఉన్నామని అన్నారు. ప్రధానంగా ఇరాక్ నుంచే దేశంలోకి కలరా కేసులను గుర్తించడంతో, దేశంలోకి ప్రవేశించకముందే కలరాని నివారించే చర్యలు తీసుకోవాలి ఉందని ఆయన వివరించారు. అలాగే కువైట్ హెల్త్ మినిస్ట్రీతో కూడా సంప్రదింపులు జరిపారు బహ్రెయిన్ అధికారులు. విదేశాల నుంచి వచ్చేవారు తమ వెంట తీసుకొచ్చే ఆహార పదార్థాల్ని ఎయిర్‌పోర్ట్‌లోనే క్షుణ్ణంగా అధికారులు తనిఖీ చేయనున్నారు. ముఖ్యంగా లిక్విడ్ ఆహార పదార్థాల పట్ల మరింత అప్రమత్తంగా ఉంటామని అన్నారు. డయేరియా, వాంతులు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ద్వారా కలరాని నియంత్రించవచ్చని హెల్త్‌కేర్ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







