50 శాతం డిస్కౌంట్‌తో ట్రాఫిక్ ఫైన్
- December 04, 2015
వాహనదారులకు 50 శాతం ట్రాఫిక్ ఫైన్ డిస్కౌంట్‌ను మరో నెల రోజులపాటు పొడిగించినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఉమ్ అల్ కువైన్ పోలీస్ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. డిసెంబర్ 2 నుంచి జనవరి 2 వరకూ పొడిగించిన గడువు అమల్లో ఉంటుంది. ట్రాఫిక్ మరియు పెట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ సయీద్ ఒబైద్ బిన్ అరన్ మాట్లాడుతూ, చాలామంది వాహనదారులు ఈ నిర్ణయం ద్వారా లబ్ది పొందుతున్నట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాలతో మరణాలకు కారణమయినవారికి మాత్రం ఈ డిస్కౌంట్ వర్తించదని ఆయన చెప్పారు. అతి వేగంతో ప్రయాణించే వాహనాలు, రెడ్ సిగ్నల్స్‌ని క్రాస్ చేసేవారు, రేసులకు పాల్పడేవారు, విండోస్ టింట్లింగ్ వంటి నిబంధనల్ని ఉల్లంఘించేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని బిన్ అరన్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్







