గోల్డెన్ ట్రెజర్ మోసం: ఏడుగురి అరెస్ట్
- April 15, 2018
దోహా: సెక్యూరిటీ ఏజెన్సీస్, ఏడుగురు సభ్యుల ముఠాని అరెస్ట్ చేయడం జరిగింది. చారిత్రక సంపద అని చెబుతూ గోల్డ్ కాయిన్స్‌ని ఇస్తామని నమ్మించి, ఈ గ్యాంగ్ మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు వివరించారు. ఖరీదైన స్మార్ట్ ఫోన్స్‌ని తక్కువ ధరకే విక్రయిస్తామని కూడా ఈ ముఠా చాలామందిని మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జమాల్ అల్ కాబి మాట్లాడుతూ, సిబిఐ ఈ ముఠాకి సంబంధించిన పలు ఫిర్యాదుల్ని అందుకుందనీ, అత్యంత పకడ్బందీగా వ్యూహ రచన చేసి ఈ గ్యాంగ్‌ని అరెస్ట్ చేశామనీ తెలిపారు. వృద్ధులు, మహిళల్ని ఈ గ్యాంగ్ టార్గెట్‌గా చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ గ్యాంగ్‌లో ఆసియాకి చెందిన ఏడుగురు సభ్యులున్నారు. ఖరీదైన మొబైల్ ఫోన్స్ కావొచ్చు, బంగారు ఆభరణాలు కావొచ్చు అలాంటివి తక్కువ ధరకు లభించే అవకాశం వుండదనీ, ఎవరన్నా అలాంటి ప్రతిపాదనలు తెస్తే పోలీసులను సంప్రదించాలని సిఐడి అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







