మళ్లీ తగ్గిన బంగారం ధరలు
- April 16, 2018
ముంబై : అక్షయ తృతీయ దగ్గర పడుతున్న తరుణంలో బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పైకి, కిందకి పచార్లు కొడుతూ ఉన్నాయి. శనివారం మార్కెట్‌లో బంగారం ధరలు పైకి ఎగియగా.. సోమవారం నాటి మార్కెట్‌లో మాత్రం మళ్లీ కిందకి పడిపోయాయి. స్థానిక జువెల్లర్స్ నుంచి డిమాండ్ తగ్గడం, అంతర్జాతీయంగా ట్రెడ్ ప్రతికూలంగా వస్తుండటంతో, బంగారం ధరలు నేటి మార్కెట్‌లో వంద రూపాయలు తగ్గి, 10 గ్రాములకు రూ.32000గా నమోదయ్యాయి. సిల్వర్ ధరలు కూడా వంద రూపాయలు తగ్గి కేజీ రూ.39,900గా రికార్డయ్యాయి.
అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాలు వీస్తుండటమే కాకుండా.. జువెల్లర్స్ కొనుగోళ్లు తక్కువ చేపడుతుండటంతో బంగారం ధరలు మళ్లీ కిందకి పడిపోయాయని బులియన్ ట్రేడర్లు చెప్పారు. గ్లోబల్‌గా కూడా బంగారం ధరలు 0.13 శాతం తగ్గి ఒక్క ఔన్స్‌కు 1,343.79 డాలర్లుగా ఉంది. సిల్వర్ 0.36 శాతం తగ్గి 16.57 డాలర్లుగా నమోదైంది. దేశ రాజధానిలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం ధర 100 చొప్పున తగ్గి 10 గ్రాములకు రూ.32వేలుగా, రూ.31,850గా రికార్డయ్యాయి. శనివారం ట్రేడింగ్‌లో బంగారం ధర ఒక్కసారిగా రూ.300 మేర చొప్పున పెరిగిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్‌లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..