ట్రాన్సిట్ ప్రయాణీకులకు యూఏఈ ఎంట్రీ వీసా
- April 16, 2018
మస్కట్: యూఏఈలోని దుబాయ్ లేదా అబుదాబీ మీదుగా ప్రయాణించే ట్రాన్సిట్ ప్రయాణీకులకు యూఏఈ ఎంట్రీ వీసాలను మంజూరు చేయనుంది. ట్రాన్సిట్ వీసా ద్వారా ప్రయాణీకులు యూఏఈలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్ని సందర్శించే వీలుంది. యూఏఈ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంతో, ట్రాన్సిట్ పర్యాటకులకు ఎంతో ఉపయోగకరంగా వుండనుంది. యూఏఈలో టూరిజం సెక్టార్‌ని ప్రమోట్ చేసేందుకు, ఎకానమీని వృద్ధి చేసేందుకు ట్రాన్సిట్ వీసాలకు సంబంధించి కొత్త పాలసీని క్యాబినెట్ అప్రూవ్ చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. యూఏఈ ఎయిర్ పోర్టుల ద్వారా 2017లో ప్రయాణించినవారిలో 70 శాతం మంది ట్రాన్సిట్ ప్రయాణీకులు. న్యూ పాలసీలో వీసా ఫీజు, స్టాప్ ఓవర్ విజిటర్స్ సంఖ్యను పెంచడం, అలాగే దేశంలోని టూరిజంని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







