తన సినిమాలో శ్రీరెడ్డికి అవకాశం పై జీవిత కామెంట్స్..
- April 17, 2018తమ కుటుంబంపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు నటి జీవిత రాజశేఖర్. కొద్ది రోజుల క్రితం హీరో రాజశేఖర్ పై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని, దీనిపై లీగల్ గా వెళతానని స్పష్టం చేశారు. నటి శ్రీరెడ్డి సినీ ఇండస్ట్రీపై చేసిన ఆరోపణల్లో కూడా వాస్తవం లేదన్నారు. ఈ సందర్భంగా శ్రీరెడ్డికి తమ సినిమాల్లో కచ్చితంగా అవకాశం ఇస్తానన్నారు. ఆమె ఎన్నో పాత్రలకు సూట్ అవుతుందని, తనకు సరిపోయే పాత్రకు తీసుకుంటామన్నారు. కాగా నటుడు పవన్ కళ్యాణ్ పై సోమవారం శ్రీరెడ్డి పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వాటిపై కూడా మాట్లాడిన జీవిత రాజశేఖర్ ఆయన్ను అంత మాట ఎందుకు అనాల్సి వచ్చింది. అసలు ఆయనేమన్నారని అంత మాట అన్నారు అని శ్రీరెడ్డి ని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- అల్ బురైమిలో డ్రగ్స్.. ప్రవాసుడు అరెస్టు..!!
- నాన్ ప్రాఫిట్ ఫౌండేషన్ ప్రారంభించిన కింగ్ సల్మాన్..!
- యూఏఈ నివాసితులు జీవితాన్ని మార్చేసిన వీసా క్షమాభిక్ష..!!
- చెల్లింపు లింక్‌ల కోసం కొత్త స్క్రీన్.. కువైట్ సెంట్రల్ బ్యాంక్..!!
- హమద్ పోర్ట్‌లో 1,700 కిలోల నిషేధిత పదార్థం సీజ్..!!
- బహ్రెయిన్ లో మరో 15 ట్రాఫిక్ సర్వీసులు డిజిటైజ్..!!
- లడ్డు బాధ్యుల పై చర్యలు: డిప్యూటీ సీఎం పవన్
- తిరుమల లడ్డూ వివాదం..హైకోర్టులో వైసీపీ పిటిషన్
- ఏపీ: నేటి నుంచి ఆన్లైన్లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్
- అల్ మక్తూమ్ బ్రిడ్జి.. జనవరి 16 వరకు తాత్కాలికంగా మూసివేత..!!