మరో వారసుడు గల్లా అశోక్ ఎంట్రీకి రంగం సిద్ధం
- April 18, 2018
టాలీవుడ్‌లో వారసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఎందరో వారసులు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగా, ఇప్పుడు మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. ప్రస్తుతం అశోక్ అమెరికాలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో నటనకి సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. మేలో ఈ కుర్రాడి సినిమా లాంఛనంగా ప్రారంభం కానుండగా, ఈ మూవీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మాణంలో రూపొందనున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఎస్ రాజమౌళి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన కృష్ణారెడ్డి గండదాసు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారట. మహేశ్ బావ సుధీర్ బాబు ప్రధాన పాత్రలో 'ఆడు మగాడ్రా బుజ్జి' అనే సినిమాను తెరకెక్కించారు కృష్ణారెడ్డి . అయితే అశోక్ చిత్రం శ్రీలంకలోని అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని టాలీవుడ్ వెండితెరపై మరో సూపర్ స్టార్‌గా ఎదిగారు మహేష్ బాబు. ఆయన తనయుడు గౌతమ్ కూడా 1 నేనొక్కడినే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చాడు. ఇక మహేష్ ఫ్యామిలీ నుండి సుధీర్ బాబు, మంజుల, ఆమె కూతురు జాన్వీ కూడా వెండితెరపై మెరిసారు. అయితే ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్న అశోక్ తెలుగు ప్రేక్షకులని ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో 5G డౌన్లోడ్ వేగం 3.2 Gbps
- బ్యాచిలర్ల నివాసాలకు విద్యుత్ నిలిపివేత
- సౌదీలో పాఠశాల విద్యార్థులకు స్పేస్ పాఠాలు
- మస్కట్‌లో పొగాకు ఉత్పత్తులపై ఉక్కుపాదం
- ఇండియాలో 50 శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!
- అరేబియా సముద్రంలో తుఫాన్.. యూఏఈపై ప్రభావం ఉంటుందా?
- ఇండియా-వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ ఖరారు..
- ఉత్సాహంతో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన కువైటీలు
- సౌదీ అరేబియాలో ఇరాన్ రాయబార కార్యాలయం పునఃప్రారంభం
- ఒమన్‌లో హిట్ అండ్ రన్ ప్రమాదం.. సైక్లిస్ట్ మృతి