24 రోజుల్లో 59 మంది టెర్రర్‌ అనుమానితుల అరెస్ట్‌

24 రోజుల్లో 59 మంది టెర్రర్‌ అనుమానితుల అరెస్ట్‌

జెడ్డా:గడచిన 24 రోజుల్లో తీవ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనీ, సహకరిస్తున్నారనీ ఆరోపణల మేరకు 59 మందిని అరెస్ట్‌ చేసినట్లు ప్రెసిడెన్సీ ఆఫ్‌ స్టేట్‌ సెక్యూరిటీ పేర్కొంది. వీరిలో 33 మంది సౌదీలు, 13 టర్కీలు, ఏడుగురు ఎమనీలు, ఇద్దరు ఈజిప్టియన్లు, ఇద్దరు ఆఫ్గాన్లు, ఓ కెన్యన్‌, ఓ నైజీరియన్‌ వున్నారు. తొలిసారిగా శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తిని మార్చి 7న అరెస్ట్‌ చేశారు. ఏప్రిల్‌ 1న కెన్యాకి చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ఫ్రెంచ్‌ వ్యక్తినీ, ఇద్దరు కెనడియన్లనీ, ఇద్దరు రష్యన్లనీ, ఐదుగురు అమెరికన్లనూ తీవ్రవాద నేరాభియోగాల నేపథ్యంలో అరెస్ట్‌ చేశారు. యెమనీసల్లో 320 మంది తీవ్రవాద అనుమానితులున్నారు. సిరియన్లు 206 మంది, పాకిస్తానీలు 79 మంది వున్నారు. మొత్తం 5305 మంది అనుమానితుల్ని అరెస్ట్‌ చేసినట్లు నఫెతాహ్‌ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.  

Back to Top