అక్కడ మహిళలకు జీన్స్, మొబైల్ నిషేధం
- April 18, 2018అన్ని రంగాల్లో ముందుకు వెళుతున్న మహిళలకు నేటి ఆధునిక యుగంలో కూడా వివక్ష ఎదురవుతూనే ఉంది. తాజాగా మహిళలు ధరించే జీన్స్ దుస్తులు , మొబైల్ ఫోన్ ను నిషేధిస్తూ ఓ గ్రామం కట్టుబాటు చేసింది. ఈ ఘటన హర్యానాలోని ఇసీపూర్ ఖేదీ అనే గ్రామంలో చోటుచేసుకుంది. అక్కడ యువతులకు ఇకపై మొబైల్ ఫోన్లు ఇవ్వొద్దని ఒకవేళ ఆలా చేస్తే తల్లిదండ్రులపై చర్యలు తప్పవని హెచ్చరించారు గ్రామపెద్దలు. అంతే కాదు యువతులు చీర లేదా స్వదేశీ దుస్తులనే ధరించాలని జీన్స్ ధరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాలని తీర్పు చెప్పింది. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అక్కడి యువతులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నారు. తమ అలవాట్లపై అడ్డుచెప్పడానికి వారెవరంటూ ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్‌కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్‌లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక