ఇకపై ఫేస్‌బుక్ నుంచే మొబైల్ రీఛార్జ్ ..

- April 19, 2018 , by Maagulf
ఇకపై ఫేస్‌బుక్ నుంచే మొబైల్ రీఛార్జ్ ..

ఫేస్‌బుక్ అకౌంట్ నుంచే మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చంటూ ఓ కొత్త ఫీచర్‌ని తీసుకు వచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారానే మొబైల్ రీఛార్జ్ సౌకర్యాన్ని యూజర్లకు కల్పిస్తోంది. నెట్ బ్యాంకింగ్, UPI, ఇతర పేమెంట్ మార్గాలతో  రీఛార్జ్ చేసుకోవడానికి వీలు లేదు. ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే ఈ సౌకర్యం ఉంది. యాపిల్ ఐఫోన్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు. ముందుగా యూజర్లు తమ మొబైల్‌లోని ఫేస్ బుక్ అకౌంట్‌కి లాగిన్ అయిన తరువాత కుడివైపు మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ కనిపించనట్లైతే సీ మోర్‌ కి వెళితే అక్కడ కనిపిస్తుంది. అక్కడి వెల్ కమ్ స్క్రీన్ పై క్లిక్ చేయాలి. అందులోని రీచార్జ్ ఆప్షన్‌ని సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత OTP పాస్‌వర్డ్ అడుగుతుంది. ఇంకేముంది ఫైనల్‌గా మీ మొబైల్ రీఛార్జ్ అయిపోయినట్లే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com